తెలంగాణలో దారుణం: బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. ఇతర బాలికలపై చేయి వేస్తూ..
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూరల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కీచక ప్రిన్సిపల్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాల ప్రిన్సిపల్ స్కూలులోని బాలికలపై చేయి వేస్తూ, తమ కులాలను అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు స్థానికులను కలవరపెట్టాయి. ఈ మేరకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తక్షణమే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ధర్నాకు దిగారు.