అందమైన భార్యను ముక్కలు కోసి బూడిద చేసి చంపడానికి గల కారణాలు చెప్పిన భర్త
హైదరాబాదులో సంచలన సృష్టించిన భార్యను ముక్కలుగా కోసం, శరీర భాగాలు ఉడికించి, ఎముకలను కాల్చి బూడిద చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో అందంగా ఉండే తన భార్యను అతి కిరాతకంగా చంపడానికి గల కారణాలు, హత్య జరిగిన రోజు విషయాలను వెల్లడించాడు.
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి భార్య వెంకట మాధవీలకు ఇద్దరు పిల్లలు. రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట్ పరిధిలో నివాసం ఉంటున్నారు. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గురుమూర్తి తన భార్యను నిత్యం అనుమానించేవాడు. హత్య జరిగిన రోజు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గురుమార్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా సాక్ష్యాలు లేకుండా ఆమె శవాన్ని మాయం చేశాడు. ఆ తరువాత గురుమూర్తి స్వయంగా పోలీసు స్టేషనుకు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు కూడా చేశాడు.
అనుమానం వచ్చిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా తనే తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్నాడు. మాధవిని అంత కిరాతకంగా ఎందుకు చంపాడని విచారించగా.. ఈ కేసులో గురుమూర్తి చెప్పిన విషయాలతో పోలీసులే షాక్ అయ్యారు.. గురుమూర్తిని చెప్పిన విషయాల ప్రకారం... ఈ నెల 14 వ తేదీన భార్యా పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్లొచ్చాము. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాము. నా భార్య నాతో గొడవ పెట్టుకుంది. తాలి బొట్టు తీసి విసిరి నా మొహం మీద కొట్టింది. ఆవేశం పెరిగిన నేను తనను గోడకు అదిమి కొట్టాను, తాను కింద పడిపోయింది. మొదట సృహ తప్పి పడిపోయింది అనుకున్నా తరువాత చూస్తే తను చనిపోయింది. ఎలాగైనా తన శరీరాన్ని మాయం చేయాలనుకున్నా. ఇంట్లో ఉన్న కత్తులు తీసుకుని నా భార్య శవాన్ని మొత్తం భాగాలుగా కోశా.. ఆ తరువాత వాటర్ హీటర్ వేసి బకెట్ నీళ్లు తన శరీరం ముక్కలు వేసి దాదాపుగా ఆరు గంటల పాటు బాగా ఉడికించాను. బాగా ఉడికిన ముక్కలను ఎండబెట్టి రోటిలో వేసి పొడి చేశాను. ఎముకలను కూడా బూడిద అయ్యే వరకూ కాల్చేశాను. తన శరీరం మొత్తాన్ని బూడిద చేసి సుమారు రెండు బకెట్ల బూడిదను తీసుకెళ్లి చెరువులో పడేశా. ఇంటికొచ్చి ఫినాయిల్ తీసుకొన్ని రక్తం మరకలన్నీ కడిగేశాను అని పోలుసుల విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది.
50 ఏళ్ల వయసులో రేణు ఆంటీ అందాల ఆరబోత
See Full Gallery Here...