టీచర్‌ని గర్భవతిని చేసిన 12 ఏళ్ల బాలుడు!

Crime Published On : Tuesday, December 24, 2024 10:49 PM

నాలుగవ తరగతి చదువుతున్న ఓ బాలుడి మీద ఓ టీచర్ కన్నుపడింది. 12 ఏళ్ల వయసున్న ఆ మైనర్ బాలుడిని లైంగికంగా లొంగదీసుకుని శృంగార చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత ఆ బాలుడితో గర్భం కూడా పొందింది ఆ టీచర్. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఈ యధార్థ ఘటన అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో టిప్టన్ కౌంటీలో జరిగింది.

ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న అలిస్సా మెక్ కామన్ అనే ఉపాధ్యాయురాలు, అదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని లొంగదీసుకుని అతనిచే గర్భవతి అయ్యింది. ఇది ఈ విషయాన్ని కనుగొన్న పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. అయితే, విచారణలో ఈ టీచర్ తాజాగా వెలుగులోకి వచ్చిన మైనర్ బాలుడి ఘటనతో పాటు అంతకు ముందు మరో 21 మంది విద్యార్థులతో శారీరక సంబంధాలు కలిగి ఉందని తెలింది. విచారణ అనంతరం సర్క్యూట్ కోర్టు జడ్జ్ బ్లేక్ నీల్ మొత్తం ఐదు ఆరోపణల మీదు మెక్ కామన్ 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.