Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
రాజస్థాన్ లోని బికనీర్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారుపై ట్రక్కు పడింది. ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.