AP : సస్పెండ్ చేశారని తుపాకీతో కాల్చుకున్న ఎస్సై
విధుల నుండి సస్పెండ్ చేశారని ఎస్సై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. ఎస్సై మూర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తణుకు రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో విధుల నుండి సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్ కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తనను సస్పెండ్ చేశారన్న మనస్తాపంతోనే మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.