చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫ్రెండుని చంపేశాడు
వారు ప్రేమించుకుని ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అంతలోనే భర్త దారుణహత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. అన్నారానికి చెందిన మాల బంటి (32), పిల్లలమర్రికి చెందిన నవీన్ ప్రాణ స్నేహితులు.
నవీన్ చెల్లెలు భార్గవితో బంటికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 6 నెలల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. నిన్న బంటి హత్యకు గురయ్యాడు. నవీన్, కుటుంబ సభ్యులే హత్య చేశారని బంటి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు, నిందితులు కలిసి రియల్ ఎస్టేట్ చేసేవారు.