తెలంగాణ : రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

Crime Published On : Tuesday, February 4, 2025 01:30 PM

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన సంఘటన గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద చోటు చేసుకుంది. క్రైం రికార్డ్స్‌ బ్యూరో ఎస్‌ఐ శ్వేత కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాలకు వెళ్తోంది. చిల్వాకోడూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారు చెట్టును ఢీకొంది.

తీవ్రంగా గాయపడిన ఎస్సై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు కూడా మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్‌, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్‌ఐగా పనిచేశారు.