ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదుగురి అత్యాచారం
తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. 10-12ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదురుగు పలు సార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారిలో నలుగురు బాలురు, ఓ 18 ఏళ్ల యువకుడు ఉన్నారు.
పరువు పోతుందన్న భయంతో బాధితులు తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.