లండన్ నుండి భార్య కోసం వస్తే.. ప్రియుడి కోసం ముక్కలుగా నరికేసింది
లండన్ నుండి భార్య కోసం వస్తే భార్య ప్రియుడి కోసం భర్తను ముక్కలుగా నరికిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరభ్ లండన్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. తన భార్య ముస్కాన్ పుట్టిన రోజు కోసం ఫిబ్రవరి 24న స్వగ్రామానికి వచ్చాడు.
ప్రియుడు మోహిత్ తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్ భర్త సౌరభ్ ను చంపాలని స్కెచ్ వేసింది. అతడు ఇంటికి రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్ తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.