19 ఏళ్ల కుర్రాడితో భర్తను చంపించి.. కనిపించడం లేదంటూ ఫిర్యాదు
దారుణంగా 19 ఏళ్ల కుర్రాడితో భర్తను చంపించి.. భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన సోనూ, సరిత భార్యాభర్తలు. భార్యది రెండో వివాహం. గత కొంతకాలంగా వారిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. భర్తను అడ్డుతొలగిస్తే తప్ప మనశ్శాంతి ఉండదని సరిత భావించింది.
అందు కోసం 19 ఏళ్ల కుర్రాడికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు ఆమే కంప్లెంట్ చేసింది. అయితే ఆమె చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది.