సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోలేదని తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదని ఓ మహిళ తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో చోటు చేసుకుంది.
తన భర్త శివ నాగరాజు, అత్తామామలు, మరిది నిత్యం తన పిల్లలను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం సీఎం, డిప్యూటీ సీఎం ఆఫీస్ల చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేదని తెలిపారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని వీడియోలో పేర్కొన్నారు.