భర్త అంగాన్ని కోసేసి.. అంతటితో ఆగకుండా..

Crime Published On : Monday, March 17, 2025 01:22 PM

హోలీ రోజున బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త అంగాన్ని కోసేసింది. అంతటితో ఆగకుండా ఇటుకతో తలపై కొట్టి హత్య చేసింది. కర్తాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని భటౌలి గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.

మిథిలేష్ పాశ్వాన్ (35), ప్రియాంక దేవి అనే జంట హోలీ రోజున తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రియాంక తన ప్రేమికుడితో మాట్లాడుతుండగా భర్త మిథిలేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం తీవ్రమైంది. ఆ సమయంలో ప్రియాంక కోపంతో కత్తి తీసుకుని మిథిలేష్పై దాడి చేసింది. అతని రెండు కాళ్ల మధ్య పొడిచింది. అనంతరం ఇటుకతో తలపై కొట్టింది. స్థానికులు మిథిలేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు. ప్రియాంకను అరెస్ట్ చేశారు. అనంతరం మిథిలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...