ఫోన్ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగి

Crime Published On : Sunday, January 26, 2025 07:30 AM

విశాఖపట్నం సమీపంలోని తగరపువలసలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మాధవి, రెండేళ్ల రితీక్ష మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఐదేళ్ల ఇషిత చికిత్స పొందుతోంది. భర్తతో మనస్పర్ధలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన బాణాల గణపతిరావు కుమార్తె మాధవిని రామకృష్ణతో 2019లో వివాహం చేశారు. మాధవి రామకృష్ణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఐదేళ్ల ఇషిత, పద్దెనిమిది నెలల రితీక్ష ఉన్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మాదవితో నిన్న తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండగా కళ్ళు తిరిగినట్టు చెప్పింది. వెంటనే ఫోన్ పక్కన పడేసింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి స్థానికంగా ఉన్న కొంతమందికి అప్రమత్తం చేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసేసరికి తల్లి, పిల్లలు ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి, కూతురు రితిక్ష మరణించారు. భర్తతో జరిగిన స్వల్ప వివాదమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.