ఏపీలో ఘోరం: యువకుడిని ముక్కలు చేసి బస్తాల్లో కుక్కి కాలువలో పడేశారు
ఏపీలోని ప్రకాశం జిల్లా కంభంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు.
ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.