యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో ఆ యువతి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.