తలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. రేప్ చేశాడు: ఏపీలో ఘోరం
ఓ యువకుడు యువతి తలపై కత్తితో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేశాడు.
నిందితుడిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.