హత్తుకునే కథతో 7G బృందావన్ కాలనీ సీక్వెల్
7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50 శాతం పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో ఈ సినిమాను రెడీ చేస్తున్నామని చెప్పారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు' సీక్వెల్ పై ఆయన మాట్లాడుతూ 'ఇది క్లిష్టమైన కథ అని, భారీగా ఖర్చవుతుందని, నిర్మాత కోసం చూస్తున్నామని చెప్పారు. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారని, కార్తి కూడా ఉంటారని తెలిపారు.