మీకు నా క్షమాపణలు.. దిగొచ్చిన పృథ్వీ
'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ వైసిపిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడం, అనంతరం ఆయన హై బిపితో ఆసుపత్రిలో చేరడం విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన స్పందించాడు. వ్యక్తిగతంగా తనకు ఎవ్వరి మీద ద్వేషం లేదని అన్నారు.
"నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు.. అందరికీ క్షమాపణలు చెపుతున్నాను. బాయ్ కాట్ 'లైలా' అనకుండా వెల్కమ్ లైలా అని అనండి. 'లైలా' పెద్ద హిట్ కావాలి" అంటూ పృథ్వీ పేర్కొన్నారు.