కొడుకుకు డిఫరెంట్ పేరు పెట్టిన నటి ప్రణీత
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ దంపతులు గతేడాది మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా పాప తర్వాత రెండవ సంతానంగా కుమారుడు పుట్టాడు. అయితే తాజాగా ప్రణతీ తన కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఫ్యాన్సీ పేర్ల వెంట పరుగెడుతున్న ఈ కాలంలో ప్రణీత తన కుమారుడికి జై కృష్ణ అని చక్కటి పేరు పెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.