సోషల్ మీడియా ట్రోలర్స్ పై నటి త్రిష ఫైర్
సోషల్ మీడియా ట్రోలర్స్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిది విషపూరిత మనస్తత్వమని, అలాంటి వారు రాత్రిళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతారని ప్రశ్నించింది. 'పనీపాట లేకుండా ఖాళీగా ఉంటూ పిచ్చి పోస్ట్ లతో కాలక్షేపం చేయడమేనా మీ పని? నిజంగా మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది. ఇలాంటి వారికి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్న అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియలో వైరల్ గా మారింది.