ఆలయంపై నటి ఊర్వశీ రౌతేలా వివాదస్పద వ్యాఖ్యలు
నటి ఊర్వశీ రౌతేలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు బద్రీనాథ్ లో ఆలయం ఉందని, అక్కడికి వెళ్ళిన భక్తులు తన ఆలయాన్ని దర్శించుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై తాజాగా అక్కడి అర్చకులు స్పందించారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు. ఊర్వశీ తన పేరుతో ఉన్న ఆలయమని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని అర్చకులు మండిపడ్డారు.