అల్లు అర్జున్ ఆరోగ్యం బాగాలేదు.. అల్లు అరవింద్

Entertainment Published On : Monday, February 3, 2025 12:39 PM

‘తండేల్' మూవీ ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని ప్రకటించినా అల్లు అర్జున్ హాజరు కలేదు. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. బన్నీ ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారని, ఈ కార్యక్రమానికి వస్తాడని అనుకున్నామని తెలిపారు.

అయితే తీవ్రమైన గ్యాస్ సంబంధ సమస్య కారణంగానే రాలేకపోయాడని చెప్పారు. ఇదే విషయాన్ని అతను తన మాటగా చెప్పమన్నాడని పేర్కొన్నారు. తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించిన విషయం తెలిసిందే.