అల్లు అర్జున్ సినిమా రీరిలీజ్

Entertainment Published On : Monday, March 31, 2025 10:23 AM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్య-2' రీరిలీజ్ కు సిద్ధమైంది. ఏప్రిల్ 5న తిరిగి విడుదల చేయనున్నట్లు AA బృందం ప్రకటించింది. "ఆర్య పిచ్చి ప్రేమలో పడేందుకు మరోసారి సమయం వచ్చింది. మరోసారి బిగ్ స్క్రీన్లపై ఈ మ్యాజిక్ను ఆస్వాదించండి" అని ఆ సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదరగొట్టగా కాజల్ అగర్వాల్, నవదీప్ తమ నటనతో అలరించారు.