ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ పెళ్లి..?
ఓ ఎమ్మెల్యేని యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రదీప్ స్పందించారు. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని తెలిపారు. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అన్నారని, త్వరలో క్రికెటర్తో మ్యారేజ్ అంటారేమోనని అన్నారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ప్లాన్ ఏమి లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమా ఈ నెల 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే.