చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Entertainment Published On : Saturday, January 18, 2025 12:25 PM

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్ లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చివరి 8 సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. దీంతో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఏం మూవీ వచ్చిన హిట్టుకు ఢోకా ఉండదని టాలివుడ్ హీరోలు భావిస్తున్నారు.