లావణ్య-రాజ్ తరుణ్ వివాదంలోకి అరియానా
హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన లావణ్య ఈ వివాదంలోకి నటి, యాంకర్ అరియానా గ్లోరీని లాగింది. 2021లో రాజ్ తరుణ్, అరియానాలు తనకు ఫోన్ చేసి బెదిరించారని లావణ్య ఆరోపించింది.
రాజ్ ను వదిలేయాలంటే ఎంత డబ్బులు కావాలో చెప్పు అని అరియానా అడిగిందని తెలిపింది. తాను, రాజ్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని, ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పామని అరియానా తనతో చెప్పిందని లావణ్య చెప్పింది.