తమన్ కు బాలయ్య బాబు లగ్జరీ గిఫ్ట్
బాలయ్య, తమన్ కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. వీరిద్దరి కాంబోలో తాజాగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలోని కొన్ని సాంగ్స్ తో పాటు బ్యాక్రౌండ్ స్కోర్ అయితే బాలకృష్ణ కెరియర్ లో బెస్ట్ అని తమన్ ప్రాణం పెట్టి పనిచేశాడని కూడా కామెంట్స్ వచ్చాయి.
ముఖ్యంగా నందమూరి అభిమానులు అయితే తమన్ కి నందమూరి అనే ఇంటి పేరు ఇచ్చేసి మరి నందమూరి తమన్ అనే పేరుతో పిలుచుకున్నారు. ఇక తాజాగా తమన్ కు అత్యంత ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చార. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాలయ్య గిఫ్ట్ గా ఇచ్చిన పోర్షే కారు కారు అక్షరాల 2.50 కోట్లు అని సమాచారం. ఇక బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ -2 కు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. తనకు బాలయ్య తండ్రితో సమానం అని తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.