ఛావా డైరెక్టర్ క్షమాపణలు
ఛావా సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారని వారి వారసులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు.
అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.