జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ వ్యవహారంలో జరిగింది ఇదేనా..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వ్యవహారం గత రెండ్రోజులుగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. జానీపై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ మీడియా ముందుకు రావడంతో చర్చ తీవ్రం అయింది. తాను ఎందుకు జానీపై కేసు పెట్టిందో, ఎందుకు ఇన్నాళ్లు వెయిట్ చేశానో చెబుతూ శ్రేష్టీ వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జానీ మాస్టర్ వెనుక అతని భార్య ప్రమేయం ఉందని, తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడనని శ్రేష్టీ చెప్పింది. తనపై వేధింపులు జరిగిన సమయంలో తాను మేజర్‌నని, పైగా అతను పలుకుబడి కలిని వ్యక్తని,ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఫైట్ చేయగలనో అప్పుడే బయటికి వచ్చానని చెప్పింది. అందుకే నాలుగేళ్ల సమయం పట్టిందని శ్రేష్టీ వర్మ స్పష్టత ఇచ్చింది.
శ్రేష్టీ వర్మ ఇంటర్వ్యూ తర్వాత జానీ సతీమణి ఆయేషా కూడా మీడియా ముందుకొచ్చి శ్రేష్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ కనుక ఆరేళ్లుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడితే, ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఆమె చెల్లి చదువుకు కూడా ఎంతో ఆర్ధిక సాయం చేయడంతో పాటు ఆమెకు డ్యాన్స్ అసోసియేషన్ సభ్యురాలి పదవి కూడా ఇప్పించామని ఆయేషా తెలిపారు.