అనిల్ రావిపూడి లవ్ స్టోరి... భార్య ఫ్రెండ్ తో ప్రేమాయణం

Entertainment Published On : Friday, January 24, 2025 05:00 PM

డైరెక్టర్ అనిల్ రావిపూడి..10 ఏళ్లలో 8 సినిమాలు తీసి అన్నీ హిట్ కొట్టిన డైరెక్టర్. రచయితగా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు ఎక్కడా తీసిపోదు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ”కాలేజ్ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం నలుగురు అమ్మాయిల బ్యాచ్ వెనుక పడేవాళ్లం. ఆ నలుగురులో నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్లి అవ్వడంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్ నే భార్గవి. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. సో.. భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే భార్య పడింది” అని చెప్పుకొచ్చాడు.

 మొదట ఆ నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడు. కొన్ని నెలల తరువాత ఆ అమ్మాయి. మోసం చేసి వెళ్లిపోయిందట. అప్పుడే భార్గవి అనిల్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను అని అడిగిందట. దీంతో ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ రోజు.. తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తుచేసి గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇలా అనిల్ లవ్ స్టోరీ పెళ్లితో ముగిసింది.