చిరు అభిమానులకు విశ్వంభర నుంచి గుడ్ న్యూస్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి తాజాగా రామ రామ పాట ప్రోమో విడుదలైంది. చిరంజీవి నోటి నుంచి వచ్చిన జై శ్రీరామ్ నినాదంతో పాట మొదలవుతుంది. ఇందులో బాల హనుమాన్లు ముందు నడుచుకుంటూ వస్తుంటే అందులో ఒకరిని చిరు తన భుజాలపై ఎత్తుకుని నడుస్తున్నాడు. ప్రోమో అయితే అదిరిపోయింది. పూర్తి పాటను హనుమాన్ జయంతి అంటే ఈరోజు ఉదయం 11.12 గంటలకు విడుదల చేయనున్నారు.