హీరో అఖిల్ పెళ్లి ముహూర్తం ఖరారు
అక్కినేని అందగాడు హీరో అఖిల్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఇప్పుడు వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. మార్చి 24న అఖిల్-జైనబ్ రవడ్జీ వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొన్ని నెలల కింద వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 2016లో అఖిల్ కు శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ అయింది. తరువాత 2017లో పెళ్లి పీటలు ఎక్కాలని అనుకున్నా అనివార్య కారణాలతో ఆ పెళ్లి జరగలేదు.