నా పరువు పోతుంది : నాగచైతన్య

Entertainment Published On : Tuesday, January 28, 2025 10:30 PM

తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ అమ్మాయి శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అని వెల్లడించారు.

వైజాగ్ లో కలెక్షన్లు రాకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపారు. గత ఏడాదిన్నరగా తన లైఫ్ లో నిజమైన నాయకుడు (తండేల్) అల్లు అరవింద్ అని చెప్పారు.