పెళ్లి కూతురుగా మృణాల్ ఠాకూర్

Entertainment Published On : Saturday, February 22, 2025 10:20 PM

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మృణాల్ సీతారామం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ ఘన విజయాన్ని సాధించడంతో మృణాల్ క్రేజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మృణాల్ నటించిన హాయ్ నాన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

 ఈ అమ్మడు ప్రస్తుతం 'డెకాయిట్' సినిమాలో నటిస్తోంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయినప్పటికీ మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. దీంతో ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే మృణాలం నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేదా ఏదైనా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇక పెళ్లి కూతురిలా ఉన్న మృణాల్‌ను నెటిజన్లు వావ్, సూపర్, క్యూట్ అని పొగిడేస్తున్నారు.

మేఘ శుక్లా హాట్ ఫోటోలు.. నిజంగానే హీరోయిన్ మెటీరియల్ భయ్యా

See Full Gallery Here...