రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. విజయ్ కోసమేనా..
త్రిష తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై త్రిష కీలక ప్రకటన చేశారు. సామాజిక సమస్యలపై పోరాడుతూ, ప్రజా సేవ చెయ్యాలన్నది తన ఆలోచన అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందని, ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. దీంతో త్రిష విజయ్ పార్టీలో చేరబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
తమిళ స్టార్ హీరోతో విజయ్‌తో త్రిష రిలేషన్ కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, విజయ్ బర్త్ డేకు త్రిష విషెష్ చెప్పడం, ఆ తర్వాత విజయ్ కోసం త్రిష తొలిసారి ఐటం సాంగ్ చేయడం అన్నీ కూడా వీరి రిలేషన్‌ను బహిర్గతం చేశాయి. ఇటీవలే వీరిద్దరు కలిసి ఓ హీరోయిన్ పెళ్లికి హాజరయ్యారు. త్రిష తాజాగా కోయంబత్తూరులోని మరుదమలై మురుగన్ ఆలయానికి వెళ్లి నేలపై కూర్చుని పూజలు నిర్వహించారు. త్రిష పూజలు చేయడం చూసిన వారంతా కూడా విజయ్‌తో పెళ్లి కోసమే ఆమె ఇలా చేస్తోందంటూ అభిప్రాయపడ్డారు.