ఇండస్ట్రీలో అలాంటి వారికే అవకాశాలు: స్టార్ హీరోయిన్
పాయల్ రాజ్ పుత్ RX 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమె ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని, టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆ ట్వీట్ లో పేర్కొంది. ఇలాంటి సమయంలో నటులుగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టమని ఆమె రాసుకొచ్చారు.