పెళ్లి కంటే రొమాన్స్ అంటేనే ఇష్టం: హీరోయిన్ శృతి హాసన్
తన పెళ్లి గురించి ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసింది. శృతి హాసన్ తన ప్రియుడు శంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని అడగడం ఆపేయండని అన్నారు. "నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. కానీ రిలేషన్ లో ఉండటానికి ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటేనే ఇష్టం. ఒకే వ్యక్తితో ఎక్కువగా అటాచ్ చేసుకుని ఉండాలంటే కొంచెం భయంగా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.