కూతురి సినీ ఎంట్రీ.. స్పందించిన కాజోల్
సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ వారసుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తారు. అయితే కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగణ్, కాజోల్ కుమార్తె నైసా దేవగన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై హీరోయిన్ కాజోల్ స్పందించింది. పుకార్లకు చెక్ పెడుతూ నైసా దేవగన్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది.