కోట్ల రూపాయలు గెలిచాడు.. చివరికి రోడ్డున పడ్డాడు
KBC (కౌన్ బనేగా కరోడ్ పతి)లో సుశీల్ కుమార్ రూ.5 కోట్లు గెలుచుకుని సంచలనం సృష్టించాడు. 2011లో ఆయన విజయం గురించి దేశం మొత్తం చర్చ జరిగింది. కానీ, ఆయన విజయం కథ కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు.
అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్ గా మారారు.