అయ్యో శ్రీవల్లి.. కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్

Entertainment Published On : Sunday, January 26, 2025 11:00 AM

తెలుగు హీరోయిన్, శ్రీవల్లి రష్మిక మందన్న కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. 2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నాని, ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నాని తెలిపారు.

"నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా' అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. రష్మిక నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అయితే ఇటీవల హైదారాబాద్ విమానాశ్రయంలో రష్మిక వీల్ చైర్ లో కనిపించిన విషయం తెలిసిందే.