రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్రేజీ లుక్
దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'SSMB29' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. తాజాగా మహేశ్ తన ఇంటి జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా, ఎవరో వీడియో తీశారు.
అందులో బాగా హెయిర్ పెంచుకుని మహేశ్ చాలా క్రేజీగా కనిపిస్తున్నారు. మహేశ్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.