లైలా సినిమాకు నందమూరి ఫ్యాన్స్ మద్దతు
లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ వైసిపి టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలతో బాయ్ కాట్ లైలా అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్ సేన్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు.
ఇదే క్రమంలో లైలా సినిమాకు నందమూరి ఫ్యాన్స్ మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్ కాట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.