అదే నా పెద్ద అచీవ్మెంట్: హీరో నాని
ఇప్పటికీ ప్రేక్షకుడిగా సినిమాను ఎంజాయ్ చేస్తుండటమే తన అతి పెద్ద అచీవ్మెంట్ అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. 'కోర్ట్' సినిమా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ 'నా దృష్టిలో ఇప్పటివరకు నేను సాధించింది ఏం లేదు. కానీ ఈరోజుకీ ప్రేక్షకుడిగా సినిమాల్ని ఎంజాయ్ చేయగలుగుతున్నా. అదే నా అచీవ్మెంట్" అని తెలిపారు.
ఏదైనా సీన్ నచ్చితే చప్పట్లు కొడతానని, ఎమోషనల్ అయిపోతానని, కానీ సినిమాను ఇలా తీశారేంటని జడ్జ్ చేయనని వెల్లడించారు.