స్టార్ హీరో వంశంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బతకలేదు.. కారణం అదేనా?
రామ్ చరణ్ మగధీర సినిమాలో కాల భైరవ వంశంలో ఒక్కరు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకరు అని విన్నాం. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక స్టార్ హీరో ఫ్యామిలీలో పురుషులు సైతం 50 ఏళ్లకు మించి బతకడం లేదు. సంజీవ్ కుమార్ గురించి ఇప్పటి తరానికి ఈ హీరో గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు బాలీవుడ్ నాట సంజీవ్ కుమార్ క్రేజ్ మాములుగా ఉండేది కాదు. హీరోగానే కాకుండా వయసు మళ్లిన పాత్రల్లో కూడా టెర్రిఫిక్‌గా నటించాడు. ఆలీబాబా ఔర్ 40 చోర్, స్మగ్లర్, కలాపి, రాజ్ ఔర్ రంక్, గౌరీ, అంగూర్, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయకుడిగా పేరొందాడు.
అలా కెరీర్ ఒక రేంజ్‌లో ఉన్నప్పుడే గుండెపోటుతో 47 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. నిజానికి వీళ్ల కుటుంబంలో ఎవ్వరు కూడా 50ఏళ్లకు మించి బ్రతకలేరట. సంజీవ్ కుమార్‌తో పాటు వాళ్ల తాత, తండ్రి, తమ్ముడు నికుల్‌తో సహా అతడి కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే మృతిచెందారు. ఇదే విషయమై సంజీవ్ కుమార్ బ్రతికున్నప్పుుడ ఓ ఇంటర్వూయర్ అడిగాడట. మీరు వృద్దాప్య రోల్స్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అని. దానికి "ఎందుకంటే నా వృద్ధాప్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను. ఆ కారణం వల్లే వృద్ధాప్య పాత్రలు చేస్తున్నానని" సంజయ్ బదులిచ్చాడట. ఆయన చెప్పిన విధంగానే వృద్ధాప్యాన్ని చూడకుండానే కేవలం 47ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.