యాంకర్ రష్మితో రాజమౌళి రొమాంటిక్ వీడియో.. ఇదెప్పుడు జరిగిందయ్యా

Entertainment Published On : Wednesday, February 19, 2025 04:00 PM

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుల్లో రాజమౌళి ఒకరు. తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక పై నిలబెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళికి సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇదెప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియోలో రాజమౌళి యాంకర్ రష్మీ తో కలిసి కనిపించారు. ఈ ఫన్నీ వీడియోలో రాజమౌళి రష్మీకి సైట్ వేయడం ఆమె రాజమౌళికి పడిపోవడం మనం చూడొచ్చు.

ఈ ఫన్నీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో విక్రమార్కుడు సమయంలోది అని తెలుస్తోంది. అప్పట్లో యువ అనే సీరియల్ లో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. ఆ సీరియల్లో ఓ సన్నివేశంలో రాజమౌళి గెస్ట్ లా కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...