వీల్ చైర్ లో హీరోయిన్ రష్మిక..అసలు ఏమైంది..

Entertainment Published On : Wednesday, January 22, 2025 08:07 PM

పలు సినిమాలతో బిజీగా ఉండే టాలివుడ్ భామ రష్మిక విమానాశ్రయంలో వీల్ చైర్ లో కనిపించారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. తాజాగా ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించారు. ఓ హిందీ చిత్రం ప్రచారంలో పాల్గొనడం కోసం ముంబయి బయల్దేరినట్లు సమాచారం. కారులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రష్మిక తన బృంద సభ్యుల సాయంతో వీల్‌ఛైర్‌లో విమానాశ్రయంలోనికి వెళ్లారు.

తనకు గాయమైన విషయాన్ని రష్మిక ఓ పోస్ట్‌ ద్వారా తెలిపారు. ''పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని సికందర్‌, థామ, కుబేర సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యాన్ని క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా'' అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

50 ఏళ్ల వయసులో రేణు ఆంటీ అందాల ఆరబోత

See Full Gallery Here...