పెళ్లిపీటలు ఎక్కనున్న సమంత?
స్టార్ హీరోయిన్ సమంత త్వరలో రెండో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళ్లని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆయనను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై సమంత ఇంకా స్పందించాల్సి ఉంది.