సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ
సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించారు. సినిమానే నా ఫస్ట్ లవ్.. కమ్బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నానని తెలిపారు. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నని అన్నారు.
90ల్లో హీరోయిన్గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేసిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లోకి రావడంతో ఎలాంటి పాత్రల్లో నటిస్తుందోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.