45 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. సీమంతం వీడియో
కోలీవుడ్ నటుడు రెడిన్ కింగ్స్టీ అందరికీ సుపరిచితమే. ఆయన జైలర్, క చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ఊహించని రేంజ్లో పాపులారిటీ దక్కించుకున్న ఆయన వ్యాపారవేత్తగా కాను రాణించారు. ఆయన 2023లో తన ప్రేయసి సీరియల్ నటి సంగీతను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
రెడిన్ భార్య సంగీతం తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ సంగీత సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సంగీత మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతుండటంతో కొందరు వావ్ గ్రేట్ అని కామెంట్ చేస్తున్నారు.