తండేల్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా

Entertainment Published On : Saturday, February 1, 2025 02:55 PM

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈసారి అసలు గురి తప్పేదే లేదూ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.